టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్
హుజూరాబాద్, నిఘా న్యూస్: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రకటన లు మాత్రమే ఇచ్చారని, చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో రోడ్డుపై చిన్న టేలాలూ పెట్టుకుంటే తక్షణమే తొలిగించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఎలాంటి టెండర్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులకు ఎందుకు కనిపించడం లేదని రవీందర్ అన్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో సామాన్యులకు ఒక న్యాయం, డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మరొక న్యాయం నడుస్తుందని అన్నారు. కావున హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టించాలని లేనిపక్షంలో దశలవారీగా అక్రమ నిర్మాణాల పైన అక్రమ లేఔట్ల పైన పోరాటం చేస్తామని రవీందర్ అన్నారు…