అమరావతి, నిఘా న్యూస్: ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయ పాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. మొదటి విడతలో ఒక్కో రైతు ఖాతాలో రూ.5 వేలు జమ చేస్తారు. మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తామ న్నారు. అన్నదాత సుఖీ భవ అమలు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవ సాయ, జలవనరుశాఖల ఉన్నతాధికారులతో సీఎం మీక్ష నిర్వహించారు.
కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొ న్నారు. సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామ న్న కూటమి హామీని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ తో నెరవేర్చినట్లయిం దన్నారు.
ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. చేసి చూపిస్తున్నాం.. రైతు లకు హామీ ఇచ్చినట్టుగానే ‘అన్నదాత సుఖీభవ’ పథ కం అమలు చేసి చూపిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నా మని.. చేసిన మంచిని ప్రజ లకు చెప్పాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.
అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్ఫోన్లకు ఒక రోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొ నాలని సీఎం నిర్దేశించారు. ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అందించిన సాయం, ఇతర వివరాలతో కరపత్రం రూపొందించి, క్షేత్రస్థాయిలో పంచాలని కలెక్టర్లకు సూచించారు.