Wednesday, March 4, 2026

నియోజకవర్గ యువతకు ఆదర్శవంతమైన యువకుడు.. కష్టాల్లో స్పందించే భీముడు

సామాజిక సేవా కార్యక్రమాలు..విద్యార్థి యువజన సమస్యలపై అలుపెరుగని పోరాటం..

సీరియల్ నెంబర్ 1కే ఓటేద్దాం.. భావితరానికి ఆదర్శవంతమైన వ్యక్తిని కాపాడుకుందాం..

వేములవాడ, నిఘా న్యూస్: న్యాత నవీన్ (లడ్డు) ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా యువతకు పరిచయం చేయనక్కర్లేని పేరు ఇది.బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా విద్యార్థి యువజన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యువనేతగా ప్రత్యేక పేరు సంపాదించిన న్యాత నవీన్ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైనటువంటి చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని ఒక దళిత సామాజిక వర్గంలో జన్మించిన న్యాత నవీన్ చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలపై మక్కువ పెంచుకొని, పేద ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఎప్పుడు పరితపించేవాడు. డాక్టర్ బి.ఆర్ అంభేడ్కర్ ను తనకు ఆదర్శమైన వ్యక్తిగా తన గుండెల్లో పదిల పరచుకొని పీడిత ప్రజల గుండెల్లో వెలుగులు నింపాలనే ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి అంచలంచెలుగా తన ప్రస్థానాన్ని ఏర్పరచుకుంటూ నియోజకవర్గంలో కాంగ్రెస్ యువజన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. గతంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొద్దిపాటి ఓట్లతో అధ్యక్ష స్థానాన్ని చేజార్చుకుని ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని నియోజకవర్గం లో క్రియాశీలకంగా యువజన నాయకుడిగా పనిచేశాడు. తాను నమ్ముకున్నటువంటి అంభేడ్కర్ సిద్ధాంతాలను ఎల్లవేళలా అనుచరిస్తూ పేద ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పంతో ఇన్నిరోజులు ముందుకు వెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో మరోసారి నిల్చుని భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. తనకు నియోజకవర్గ అధ్యక్ష స్థానాన్ని కట్టబెడితే మరింత ఉన్నత స్థాయిలో ఉండి విద్యార్థి సమస్యలను, యువజన సమస్యలను ప్రభుత్వ పెద్దలను సమన్వయం చేసుకుంటూ యువతరానికి బంగారు బాటలు వేస్తానని గుండెలు నిండా ఉన్న ధైర్యంతో అయన వేడుకుంటున్నాడు.
ఇప్పటికే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసిన అనుభవం,విద్యార్థి సమస్యలపై గత ప్రభుత్వంలో అలుపెరుగని పోరాటం అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను శాసనసభ ఎన్నికల్లో గెలిపించేందుకు శక్తిని మించి కష్టపడిన తీరు మన కళ్ళ ముందు అందరికీ విధితమే. ఇలాంటి బడుగు బలహీన వర్గాల యువనేతను ఎన్నుకుంటే ఎంతోమంది యువతరానికి ఆదర్శవంతుడిగా కష్టాల్లో సొంత అన్నల మీకోసం నిలబడతానంటూ ముందుకు వస్తున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలు ఉన్న యువ నేతగా సీరియల్ నెంబర్ ఒకటికి మీ అమూల్యమైన ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ యువతరాన్ని న్యాత నవీన్ వేడుకుంటున్నారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular