Sports: భారత సంతతికి చెందిన 8 ఏళ్ల బుడ్డోడు చదరంగా క్రీడల్లో సంచలనం సృష్టించాడు. స్విట్జర్లాండ్ లో జరిగిన బర్గ్ డార్పర్ స్టాడస్ ఓపెన్ టోర్నమెంట్ లో సింగపూర్ తరుపున ప్రాతినిత్యం వహించిన భారత సంతతి చిన్నారి అశ్వత్ కౌశిక్ నాలుగో రౌండ్లో గ్రాండ్ మాస్టర్ 37 ఏళ్ల జాసెట్ సోఫాపై విజయం సాధించాడు. క్లాసికల్ గేమ్స్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ ఓడించిన అత్యంత చిన్న వయస్సు ఆటగాడిగా అశ్వత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు ప్రస్తుతం ర్యాంకింగ్లో 37,338 ర్యాంకుతో ఉన్న అశ్వత్ భారత్ కు చెందిన వాడే. అయితే అతని కుటుంబం 2017లో సింగపూర్ వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున ఆడుతున్నాడు.
8 ఏళ్ల బుడ్డోడు రికార్డు సృష్టించాడు..
RELATED ARTICLES