Sunday, August 31, 2025

దేశవ్యాప్తంగా తపాల కొలువుల మేళ

హైదరాబాద్, నిఘా న్యూస్ :దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024 -25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో మొత్తం 44,228 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో ఆంధ్రప్రదేశ్ లో 1,355 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 981 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఏఏ గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయాలను indiapostg dsonline.gov.in లో చూడొచ్చు.కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా, ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగం పొందొచ్చు. అర్హత కలిగిన వారు 2024 ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 44,228 పోస్టులలో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మా స్టర్ (ABPM)/డాక్ సేవక్‌ల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

బ్రాంచ్ పోస్టు మాస్టర్ బీపీఎం పోస్టుకు నెలకు రూ. 12వేలు నుంచి 29,380 వరకు జీతం చెల్లిస్తా రు.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ. 10వేల నుంచి రూ. 24,470 వరకు జీతం చెల్లిస్తారు.ఎంపికైన వారందరికీ ధృవీ కరణ పత్రాల పరిశీలన జరిపి పోస్టులను కేటాయి స్తారు.ఇందుకు సంబంధించి న వివరాలను indiapost gdsonline.gov.in అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ గ్రామంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను indiapostgdsonline.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular