విజయవాడ, నిఘా న్యూస్: నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి MP నియోజకవర్గాలకు అభ్యర్థులను YCP ఖరారు చేసినట్లు తెలుస్తోంది.నంద్యాల టికెట్ను హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్కు ఇచ్చే సూచనలు ఉన్నట్లు టాక్.అలాగే అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. నంద్యాల నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లింలు ఉండడం వల్ల ఈ నియోజకవర్గం ఆయనకే కేటాయిస్తే కచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. అయితే కర్నూలు నియోజకవర్గాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.