కరీంనగర్, నిఘా న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకు చాలామంది ఉత్సాహం చూపుతారని ‘ అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి’ అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో పాఠశాలలకు చెందిన విద్యార్థిని జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినంద సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని మరియు వివిధ స్థాయిలో నిర్వహింపబడేటువంటి వివిధ పోటీలలో సైతం పాల్గొన్నందుకు ప్రోత్సాహం అందించడంతోపాటు తగినటువంటి సహకారాన్ని అందించాలని వారు చెప్పారు.
ఈ విధంగా విద్యార్థులు వారికి ఇష్టమైన రంగాల్లో ఎంపిక చేసుకొని విజయం తప్పనిసరిగా సాధిస్తారని వారు అభిప్రాయపడ్డారు పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక పోటీ నిర్వహించి చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని వివిధ పోటీలకు ఎంపిక చేస్తున్నామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహింపబడినటువంటి ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి ఎ.సహస్ర, 9వ తరగతి, అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా త్వరలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు సైతం అర్హత సాధించినదని హర్షం వ్యక్తం చేశారు
అర్హత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థినికి పుష్పగుచాన్ని అందజేస్తూ జాతీయస్థాయిలోనూ తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


