కరీంనగర్, నిఘాన్యూస్:తెలంగాణ రాష్ట్రం సంస్కృతికి బంగారు నిలయం అని మరియు పండుగల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించేది తెలంగాణ రాష్ట్రమేనని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో నిర్వహించినటువంటి బోనాల జాతరకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు మహాంకాళి మాతకు పూజా కార్యక్రమాన్ని ఆచరించారు. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి చిత్రపటానికి, బంగారు బోనానికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాలు అమ్మవారి రూపాలుగా భావిస్తారని,అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారని తెలుపుతూ మన రాష్ట్రంటోనే కాకుండా వివిధ రాష్ట్రాలలోబోనాలకు ప్రత్యేకత కల్పించారని చెప్పారు. నేటి కాలంలో చాలా మంది బోనాల పట్ల ఆసక్తిని ప్రదర్శించడమేకాకుండా వాటిలో పాల్గొనేందుకు చాలా శ్రద్ధ వహిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో బోనాలఉత్సవాలు శాంతి శోభను విస్తరింపచేస్తుందని చెప్పారు.విద్యార్థులకు మన రాష్ట్ర సంస్కృతిని మరియు కళలను ప్రత్యక్షంగా తెలియజేయటానికై నేడు బోనాల ఉత్సవాలను చాలా ఉత్సాహం మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని చెప్పారు.వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి తల్లి పెద్దమ్మ దయ ఉంచమ్మ, దీవనలు ఇవమ్మ, అంబాభవాన్ని… జగదాంబ భవాన్ని శారదే, పోతరాజుల విన్యాసాలు ఆకర్షించాయి. పాఠశాల ప్రాంగణాన్ని వివిధ పూలతో మరియు బెలున్లతో చాలా ఆకర్షనీయంగా అలంకరించారు. సుమారు 150 మంది వివిధ వేషాలతో విచ్చేసి పండుగ వాతావరణాన్ని తలంపించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
