కరీంనగర్, నిఘా న్యూస్: క్రీడల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తద్వారా వారు విజయాలను చాలా సులువుగా సాధిస్తారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక వావిలాల పల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో మరియు భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు తప్పనిసరి అని మరియు వారికి వివిధ క్రీడల గురించి సమగ్రంగా తెలియపరచవలసిన అవసరం ఎంతగానో ఉందని దీని ద్వారా విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడా రంగాన్ని ఎంపిక చేసుకొని అందులో నైపుణ్యం సాధించే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని వారు సూచించారు. తల్లి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు ఇష్టమైనటువంటి క్రీడా రంగాలలో శిక్షణ ఇప్పించాలని మరియు విజయం సాధించే విధంగా ప్రేరేపించాలని చెప్పారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను వివిధ సందర్భాలలో నిర్వహించడం జరుగుతుందని మరియు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని వారు చెప్పారు.వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఖో-ఖో, కబడ్డి,
హ్యాండ్బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముందు వారు క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులతో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తామని ప్రమాణం చేయించారు
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, వ్యాయమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నా.రు


