కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. బిజెపి అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ప్రకటించగా.. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ ఎదుర్కోనున్నారు. అయితే టిఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పేరు వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ఉంటుందని ‘కలాం నిఘా’ మీడియా ముందే ప్రకటించింది. సంచలన వార్తలు అందించడంలో ముందుండే కలాం నిఘా మీడియా రాజకీయ వార్తలు అందించడంలో తీవ్రంగా కృషి చేస్తుంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా కొన్నాళ్ల నుంచి ఎవరు ఉంటారని అని పార్టీ నాయకులు తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని అన్నారు. కానీ జీవన్ రెడ్డి బరిలో లేరని పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు ప్రకటించారు. దీంతో ప్రసన్న కుమార్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. మరికొందరు కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అన్నిటిని పరిశీలించిన తర్వాత చివరగా నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.
అల్ఫోర్స్ విద్యా సంస్థలను నెలకొల్పి ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటే గెలిచే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావించింది. మరోవైపు నరేందర్ రెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్కు అండదండగా ఉంటూ వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులను కలిసిన నరేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వెళ్లి చాలా రాజేందర్ కు టికెట్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఆయన బరిలో ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారని నమ్ముతున్నారు. ఇప్పటికే విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు కూడా పట్టభద్రుల మద్దతును పొందుతారని చర్చించుకుంటున్నారు. అయితే బిజెపి తరఫున పోటీ చేసే అంజిరెడ్డి నుంచి ఎలాంటి పోటీ ఉంటుందోనని అంటున్నారు.మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన అభ్యర్థిని ప్రకటిస్తే తీవ్రంగా పోటీ ఉండే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు. వీరితోపాటు కొందరు స్వతంత్రులు విద్యావంతులు కూడా బరిలో నిలుచున్నారు. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి..