కరీంనగర్, నిఘా న్యూస్: విద్యతో పాటు విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వాటిలో నైపుణ్యం సాధించే విధంగా వనరులను అందజేయాలని, తద్వారా వారు విజయాలను సొంతం చేసుకుంటారని VNR ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, “అల్ఫోర్స్” విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ శివారులోని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత స్విమ్మింగ్ శిబిరాన్ని సందర్శించి నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు మరియు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ క్యాంపులో భాగంగా విద్యార్థులకు స్విమ్మింగ్ లోని వివిధ రకాల పద్ధతులతో పాటు సిమ్మింగ్ చేసే సమయాన పాటించేటువంటి నియమ నిబంధనలను నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ నిపుణులు సూచనలను పాటిస్తూ స్విమ్మింగ్ లో నైపుణ్యం పొందాలని సూచించారు మరియు పలు జాగ్రత్తలను పాటిస్తూ క్రీడా స్ఫూర్తిని పరిరక్షించాలని కోరారు.తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరూ విద్యతో పాటు క్రీడల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

VNR ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నామని ఈ కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.