కరీంనగర్, నిఘా న్యూస్:ప్రాధమిక దశ నుండే విద్యార్థులకు పలు వినోదభరితమైన కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఒత్తిడిని తక్కువ చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వావిలాలపల్లిలోని పాఠశాల మైదానంలో వేడుకగా “ఆనందోత్సవ్” పేరుతో నిర్వహించినటువంటి పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు శాస్త్రోతంగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాతకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగి ఘన విజయాల వైపు పయనించి సమాజానికి తగిన గుర్తింపు తేవాలని చెప్పారు. నేడు చాలా మంది విద్యార్థులు ప్రణాళిక లేకపోవడం వలన మరియు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి విజయాలని సాధించలేకపోతున్నారని గుర్తు చేశారు. తరగతి గదుల్లో భోదించిన విషయాలను చక్కగా ఎప్పటికప్పుడు సాధన చేసి విశ్లేషించి చాలా గొప్పగా విజయాలను నమోదు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు గురువులు భోదించిన విషయాలను సాధన చేసి వాటిలో పట్టు సాధించి ఆదర్శంగా ఉండాలని చెప్పారు.
భారతదేశ విద్యారంగం ఒక్క ప్రతిష్ఠను గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్రమోడి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మరియు విద్యాభివృద్ధి ప్రణాళికలను నిపుణుల సహకారంతో జయప్రధంగా అమలు చేస్తు ఎన్నో ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నారని చెప్పారు. నేడు చాలా మంది విద్యార్థులు నిర్లక్ష్య వైకరితో విద్యను కొనసాగించడం చాలా విచారకరమని తెలిపారు. ప్రతి ఒక్కరు సమాజంలో వెలువడుతున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరించి అగ్రగామిగా ఉండాలని చెప్పారు.
కరీంనగర్ జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలబెడుతున్న నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తు భవిష్యత్లో మరిన్ని శాఖలను ప్రారంభించి విద్యారంగ అభివృద్ధికై కృషి చేస్తు ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కొనియాడారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను మాత్రమే సాధన చేయకుండా సమాజంలో వెలువడుతున్న పలు మార్పులను మరియు చోటు చేసుకునట్టువంటి సంచలనాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లి దండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చాలా చక్కటి ప్రణాళికలతో ముందంజలో ఉండాలని చెప్పారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి “శంభో హర శంభో”, “జై సియరామ్ జై సియరామ్”, “కేంతా మరియు బలగం నృత్యాలు” చాలా ఆకర్షించాయి. విద్యార్థులు చేపట్టినటువంటి లవ్ విత్ ఫన్ నాటిక ఆలోచింపచేసింది. వార్షిక ప్రణాళికల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించినటువంటి పలు పోటీలలో గెలుపొందిన వారికి అతిధుల చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.