ప్రజల సమక్షంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 8 హామీలను బాండ్ పేవర్ పై రాసి సంతకం చేసారు
– ప్రసన్న హరికృష్ణ, పట్టభద్రుల ఎమ్మేల్సీ అభ్యర్ధి
కరీంనగర్, నిఘా న్యూస్: అక్షరమే ఆయుధంగా అక్షర సేధ్యం చేస్తున్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలిచి ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మేల్సీ అభ్యర్ధి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ కోరారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే మైదనాంలో పట్టభద్రల సింహగర్జన పేరున సభ జరిగింది.ఈ సభలో ఆయన మాట్లాడుతూ సమాజంపై పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నారు. ప్రసన్న హరికృష్ణ మీ అందరి కుటుంబ సభ్యుడని, సమాజం పట్ల, పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అని వెల్లడించారు. పట్టభద్రుల సమస్యలపై ఎవరికి అవగాహన ఉందో, ఎవరికి స్పష్టత ఉందో అన్న విషయాన్ని గుర్తించి వారికి ఓటు వేయండని ఆయన కోరారు. మీరందరు గ్రాడ్యుయేట్స్ మీకు మీ సమస్యలు ఏమిటో తెలుసు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

గత 19 సంవత్సరాల అసిస్టేంట్ ప్రోఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రులకు సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో నిలిచి మీ ముందుకు వచ్చాను. నిరుద్యోగుల సమస్యల పై స్పష్టత,అవగాహన ఉన్న వ్యక్తిగా, పది లక్షల స్టూడెంట్స్‌తో అనుబంధం పెంచుకున్న వ్యక్తిగా, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రావాడానికి కృషి చేసేన వ్యక్తిగా తనకు ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మేల్సీ ఎన్నికలల్లో తొలి సారిగా ముఖ్యమంత్రి ప్రచారానికి రావడాన్ని ఆయన ఏద్దేవ చేసారు. విద్యారంగాన్ని కార్పోరేటర్ వ్యక్తుల చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖకు మంత్రి కూడ లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. విద్యావ్యవస్ధలు బాగుపడాలంటే ప్రతి వ్యక్తిలో అ తపన ఉండాలి. ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు పట్టభద్రుల సమస్యలను గాలికి వదిలేసి తమ ఆస్తులు కాపాడుకుంటు విద్యారంగాన్ని వ్యాపార రంగంగా, ఆదాయ వనరులుగా మార్చుకుంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పట్టభద్రులైన మీ అందరికి వాస్తవాలు తెలుసు, నిజాలను గ్రహించాలన్నారు.
నిరుద్యోగుల, ఉద్యోగుల, పట్టభద్రుల సమస్యలను ప్రశ్నిస్తు, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటా ఇస్తున్నట్లు ఆయన పెర్కోన్నారు. ప్రసన్న హరికృష్ణ ఇచ్చిన మాటా మరిచే వ్యక్తి కాదని, మీ బిడ్డ మాట తప్పే వ్యక్తి అంతకంటే కాదని. మీలో ఒక్కడిగా, మీ అన్నగా, తమ్ముడిగా, మీ వాడిగా ఆదరించి ఆశీర్వదించమని కోరారు. . మీ సమస్యల పరిష్కారంలో అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేసారు. ఈ సింహగర్జన సాక్షిగా వేదిక పై ప్రసన్న హరికృష్ణ ఇచ్చిన 8 హమీలైన తన జీతంలో 50శాతం పేద విద్యార్ధులకోసం, జాబ్ క్యాలెండర్, పోస్టుల పెంపు, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, నిరుద్యోగులకు ఉచిత జాబ్ మేళాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కరం, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, గ్రఃథాలయాల్లో ఉచిత మధ్యాహ్న భోజనం, విద్యవ్యవస్ధ బలోపేతం అంశాలను బాండ్ పేవర్ పై రాసి ప్రజల సమక్షంలో సంతకం చేసారు. ఈ సింహ గర్జనలో బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవి, నాయకులు విక్రమ్, విఠల్ తదితరులు పాల్గోన్నారు.



