కరీంనగర్, నిఘా న్యూస్: బాధిత మహిళలు మౌనం వీడి ధైర్యంగా ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావాలని కరీంనగర్ షీ టీం ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీలత సూచించారు. బుధవారంనాడు కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన షీ టీమ్ అవగాహనా కార్యక్రమంలో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ షీబృందాల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో, కళాశాలలు, రద్దీ ఉండే ప్రదేశాల్లో, బస్టాండ్లో షీ టీమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. రద్దీ ఉండే ప్రదేశాల్లో షీ టీం సిబ్బంది మఫ్టీలో ఉంటారని, మహిళలను వేధింపులకు గురిచేసే ఆకతాయిలను గుర్తించి పట్టుకుంటామని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు. వేధింపులకు గురైన వారు వెంటనే డయల్ 100 లేదా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712670759 లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధిత మహిళలు లేదా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ విజయమని, కళాశాల సిబ్బంది, షీ టీం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాధిత మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి
RELATED ARTICLES