పెద్దపల్లిలో పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం
హాజరైన సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి కలవేన శంకర్
పెద్దపల్లి, నిఘా న్యూస్: శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీకి మద్దతు గా పార్లమెంట్ సమీక్షా సమావేశం పట్టణం లోని స్థానిక గ్రాండ్ రుచి బంక్వీట్ హాల్ జరిగింది. జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైనా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం నియంతత్వ పోకడలతో పదేళ్లు పరిపాలించి దేశాన్ని భ్రష్టు పట్టించిందని కార్పొరేట్ సంస్థల చేతిలో మోదీ ప్రభుత్వం కీలుబొమ్మగా కాబట్టి రానున్న ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్పి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్ సిపిఐ జిల్లా కరీంనగర్ కార్యదర్శి వెంకట స్వామి లతో కాంగ్రెస్ పార్టీ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాకా వారసుడిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకే తమ మద్దతు అని తెలిపారు.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ కాకా హయాంలో పెద్ద పల్లికి నల్ల బంగారం అయినా సింగరేణి సంస్థకు నాలువందల కోట్లు కేటాయించి సింగరేణి బొగ్గు గని కార్మికులను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈరోజు దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేది కూడా కాకా కుటుంబం మాత్రమేనని ఎవరి అన్ని ఆరోపణలు చేసిన తాము ప్రజల కోసమే పని చేశామని అలాగే వారి సంక్షేమ కోసం పాటు పడతామని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దేశ అభ్యున్నతి జరిగిందని అయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించిన విధంగానే బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో నుంచి వెలివేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కరమైన శంకర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంలో మాట్లాడుతూ దేశంలో ఓవైపు ధరలు మరోవైపు నిరుద్యోగం తాండవం చేస్తుందని నిరుద్యోగ సమస్య పోవాలంటే కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కాంగ్రెస్ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు