టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్
హుజూరాబాద్, నిఘా న్యూస్: హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం, ఫిర్యాదు కలెక్టర్ గారికి చేరకుండా అడ్డుకుంటుంది ఎవరు?..అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అక్రమ లేఔట్ లపై కలెక్టర్ గారు ఆదేశించిన మున్సిపల్ మరియు సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో అక్రమ లేఔట్లపై కౌన్సిల్ సభ్యులు సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖను కలెక్టర్ గారికి మరియు సిపి గారికి పంపమని హుజురాబాద్ మున్సిపల్ అధికారులకి ఇచ్చిన ఆ ఫిర్యాదు లేఖను కలెక్టర్ గారికి సిపి గారికి పంపకపోవడంలో ఆంతర్యం ఏంటో మున్సిపల్ అధికారులు తెలియజేయాలి. మున్సిపల్ కౌన్సిల్లోని కీలక సభ్యురాలి భర్త ఈ వ్యవహారంలో ఉన్నారని గతంలో వార్త మద్యమాలలో వచ్చిందని అందుకే మునిసిపల్ అధికారులు సంబంధిత లేఔట్లపై చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. హుజరాబాద్ కౌన్సిల్లో తీర్మానం చేసిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని రవీందర్ అన్నారు.. మున్సిపాల్ కార్యాలయం ఎదురుగా అక్రమంగా నిర్మాణం చేపడుతున్న కట్టడాలను నిలిపివేశామని చెబుతున్న అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇట్టి అక్రమ నిర్మాణాన్ని ఎందుకు పూర్తిగా తొలగించడం లేదో మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలని అన్నారు. హుజురాబాద్ మునిసిపల్ అధికారుల మరియు సంబంధిత అధికారుల తీరుపై ప్రజా దర్బార్ లో మరియు గౌరవ హైకోర్టు వారికి ఫిర్యాదు చేయనున్నామని ఈ సందర్భంగా రవీందర్ అన్నారు