కరీంనగర్ (నిఘా న్యూస్):- కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని నెల్లి వాడకు చెందిన అడపా శ్రీనివాస్-వరలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని గాదె కరుణాకర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గ్రామంలోని నెల్లి వాడకు చెందిన తమ భూమిలో చెత్త చెదారం,సెప్టిక్ వ్యర్థలు వేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నడని ఆరోపించారు.తాను ఇంటి నిర్మాణం చేసుకునేందుకు చదును చేసుకున్న స్థలంలో ఉద్దేశపూర్వకంగా వ్యర్థలు వేస్తూ దౌర్జనానికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ విషయంపై పలుమార్లు పెద్దమనుషులతో మర్యాద పూర్వకంగా చెప్పినప్పటికీ తన పద్దతి మార్చుకోవడం లేదన్నారు.దింతో చేసేదేంలేక గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించి,పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.తమ భూమిలో దౌర్జన్యంగా వ్యర్థలు వేస్తూ ఇబ్బందులగు గురి చేస్తున్న అడపా శ్రీనివాస్-వరలక్ష్మీ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఖాళీ స్థలంలో వ్యర్థాలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి..
RELATED ARTICLES