కరీంనగర్, నిఘా న్యూస్: విద్యార్థిపై దాడి చేసిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నీ మేరకు శుక్రవారం కళాశాల ముందు వారు విద్యార్థితో సహా ఆందోళన చేశారు. కరీంనగర్ లోని సాలె హ్ నా నగర్ వద్ద ఉన్న ట్రినిటీ కళాశాలలో తరుణ్ అనే విద్యార్థి సిఈసి చదువుతున్నాడు. ఈ విద్యార్థిని కళాశాల లోని పిఈటి తోపాటు ప్రిన్సిపాల్ చిభాదారని డివైఎఫ్ వై అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆరోపించారు. ఈ మేరకు వారు నాయకులతో కలిసి విద్యార్థిని పరామర్శించారు. అనంతరం కళాశాల భవనం ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థిని చితక పాదాడంతో ఆయన తల, వీపుపై తీవ్ర గాయాలయ్యాయని వారు ఆరోపించారు.
విద్యార్థిని చితకబాదిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ వై
RELATED ARTICLES


