గార్ల జులై 22 (నిఘా న్యూస్):జులై 28 నుండి జరుగనునన్న సమావేశాల్లో బడ్జెట్లో విద్యారంగానికి రాష్ట్రం 30% నిధులు కేటాయించాలని గార్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పరిరక్షణకు, ప్రభుత్వ విద్యా బలోపితం చేసే విధంగా నిధుల కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు గత ప్రభుత్వం 10 ఏళ్లుగా విద్యకు సరైన నిధులు కేటాయించలేదని ఈ సంవత్సరం అయినా అధికంగా నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ విభజన హామీల ప్రకారంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల, ఐఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదని ఈ సంవత్సరమైనా ఆ దిశగా హామీల అమలు చేయాలని అన్నారు , అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యకు 30% నిధులు కేటాయించాలన్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని .అసెంబ్లీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మద్యాహ్న పతకం అమలు చేసే విదంగా తీర్మాణం చేయాలని .గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు, ఎస్ఎంఎచ్ హాస్టల్ ను ఏర్పాచేయాలని మొదలగు సమస్యలు పరష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణం సొంత నిదులతో ఏర్పాటు చేస్తానని స్పష్టమైన హామి ఇచ్చారు.ఈ కార్యక్రంలో ఏఐఎస్ఎఫ్ కళాశాల కమిటి నాయకులు, శివ,సాయి, వేను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా రంగానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి
RELATED ARTICLES