వరంగల్ , నిఘా న్యూస్: వరంగల్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లి గ్రామానికి చెందిన ఆమె, వరంగల్ హంటర్ రోడ్డులో ని ఫాదర్ కొలంబో ఆస్పత్రి లో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.
సోమవారం రాత్రి విధులు పూర్తయ్యాక భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏడుమోరీల కూడలి వద్ద బైక్‌పై వెళ్తున్న దంపతుల ను వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న డాక్టర్ మమతారాణికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారు జామున మృతి చెందారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైద్య వర్గాల్లో విషాదం
డాక్టర్ మమతారాణి మృతితో ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకవైపు నిండు గర్భిణి, మరోవైపు సేవా భావంతో పనిచేసే వైద్యు రాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్న ప్రాణ నష్టాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ముఖ్యంగా నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


