Friday, February 27, 2026

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి, నిఘా న్యూస్: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది,మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది అతివేగం నలుగురు వర్సిటీ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది.

మీర్జాగూడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. విద్యార్థులంతా మోకిల వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సమయం కావడంతో రహదారి నిర్మానుష్యంగా ఉంది. మీర్జాగూడ మలుపు వద్ద కారు అతివేగంతో ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది.

ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఇంజిన్ లోపలికి చొచ్చుకుపోవడం తో విద్యార్థులు కారులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో అతడికి చికిత్స అందుతోంది.మృతులలో ముగ్గురు ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు కాగా, ఒకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు.

మృతులను సూర్యతేజ, సుమిత్‌, శ్రీనిఖిల్‌, రోహిత్‌లుగా పోలీసులు ధృవీకరించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించా ల్సిన యువకులు.. ఇలా అకాల మరణం చెందడంతో ఆయా కళాశాలల్లో, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

ప్రమాద సమాచారం అందుకున్న మోకిల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను వెలికితీయడానికి గ్యాస్ కట్టర్లను వాడాల్సి వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదా నికి అతివేగం కారణమా? లేక తెల్లవారుజామున ఉండటంతో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత ప్రమాదానికి గల పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా, ప్రస్తు తం చలి కాలం కావటంతో ఉదయం పొగమంచు ఎక్కువగా ఉంటుందని ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular