Thursday, March 5, 2026

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో హోరాహోరీ పోరు

కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో హోరా హోరీ సాగుతోంది. ఈ కౌంటింగ్ లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం అయిన 48 గంటల తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ సమయానికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,977 తో లీడ్ లో ఉన్నారు. బుధవారం ఉదయం 11 ముగిసేసేసరికి బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు రాగా, బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,751 ఓట్లు రావడంతో బిజెపి 4977 ఓట్ల లీడ్ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,,007 పోల్ కాగా, 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు *1,12,169 ఓట్లను కోటగా నిర్ణయించారు. బుధవారం సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి.

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాచారంలో ‘కలాం నిఘా’ న్యూస్ చేసిన సర్వే నిజం కాబోతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయని చెప్పిన ప్రకారంగానే ఆ పార్టీకి చెందిన మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లోనూ ‘కలాం నిఘా’ చెప్పిన ప్రకారంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు అధికారికంగా వెులువడే అవకాశం ఉంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular