Friday, February 27, 2026

భద్రాది కొత్తగూడెం జిల్లాలో రైతు మేళా

భద్రాది జిల్లా, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సన్న,చిన్న కారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది, వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరుతో రైతులకు ట్రాక్టర్లు,వరి కోత మిషన్లను, సబ్సిడీ కింద ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా….

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శుక్రవారం రైతు మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండు వ్యవసాయ కొత్త పథకాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో పడావు పడ్డ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి, 350 మంది రైతులకు రూ.1.07 కోట్ల విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు.

జాతీయ ప్రకృతి వ్యవసా య మిషన్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. వ్యవసా య ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆద ర్శ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోం దని, రైతుల సంక్షేమానికి పాటుపడుతోందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular