Thursday, March 12, 2026

రాజకీయ వివాదానికి తెర..?

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో ఇవ్వాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవ హారానికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు విచా రణను ముగించడంతో, పార్టీ ఫిరాయింపు ఆరోప ణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. స్పీకర్ ఇప్పటికే ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకుని తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఈ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే అవసరం లేదని భావించిన సుప్రీం కోర్టు కేసును డిస్పోజ్ చేసింది.

దీంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదానికి తాత్కాలికంగా తెరపడిన ట్టైంది. ఈ కేసును సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా స్పీక ర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరాలు సమర్పించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి స్పీకర్ ఇప్పటి కే తీర్పు ఇచ్చారని వారు తెలిపారు.

స్పీకర్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఈ వ్యవహారం లో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం భావించింది. అందుకే ఈ కేసును ముగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రతులు తమకు ఇంకా అందలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చా రు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, స్పీకర్ తన తీర్పు కాపీలను రెండు రోజుల్లో పిటిషనర్లకు అందించాలని ఆదేశించింది.

అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన ఇతర పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లను ఐదు రోజుల లోపు అందజే యాలని కూడా స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ మైన పదవిలో ఉన్న స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానం జోక్యం చేసుకునే పరిధి పరిమితంగా ఉంటుందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కీలక నిర్ణయం ప్రకటించారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారినట్లు నిరూపిం చే సరైన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను ఆయన తిరస్కరించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లైంది. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యే లపై వచ్చిన పిటిషన్లను కూడా స్పీకర్ తిరస్కరిం చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మొత్తం పది పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించ డంతో, అసెంబ్లీ పరిధిలో ఉన్న ఈ వివాదానికి ముగింపు పలికినట్టైంది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు గడువు విధించింది. ఆ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

మొత్తంగా చూస్తే, తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నెలకొన్న వివాదంలో ప్రస్తుతం స్పీకర్ తీర్పు ఆధారంగా పరిస్థితి స్పష్టమైంది. సుప్రీంకోర్టు విచారణ ముగియడంతో, ఈ అంశం రాజకీయంగా కూడా కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular