రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డెప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో చికిత్స అందేలా తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలో జిల్లా ఆసుపత్రిలో అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సోమవారం డాక్టర్ చికోటి సంతోష్ కుమార్‌కు ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో ముఖ్యమని, అంకితభావంతో పనిచేసే వైద్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం డాక్టర్ సంతోష్ కుమార్‌ను ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్‌కు ప్రశంసా పత్రం
RELATED ARTICLES


