Friday, March 6, 2026

పోలీసులమని బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి.

కరీంనగర్ , నిఘా న్యూస్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్మత్ పాషా శుక్రవారం తన ఆటో లో నలుగురు పురోహితులను తీసుకుని వేములవాడ దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అసిఫ్ నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన ఆటో ఆపి, తాము పోలీసులమని చెప్పారని, తన వాహనానికి సంబందించిన పత్రాలు చూపించాలని అడిగారని, మొబైల్ నందు గల పత్రాలను చూపించినప్పటికీ అవి సరిపోవని , బౌతికంగా వెంట కలిగివుండాలి లేనందున డబ్బులు చెల్లించాలని బెదిరించారని, అనుమానం వచ్చిన బాధితుడు వారి ఐడెంటిటీ కార్డులు అడగగా అక్కడి నుండి పారిపోయారని, తనకంటే ముందు ఆపిన వాహనాల వద్ద డబ్బులు వసూలు చేసారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై 308(3), 319(2 ) , 204 ఆఫ్ బి ఎన్ ఎస్ – 2023, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చెక్రాల రాజు తండ్రి హనుమంతు , గొట్టెముక్కల విజయ్ తండ్రి నర్సయ్య నిందితులను కనిపెట్టి అదుపులోకి తీసుకున్నామని కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular