Friday, March 6, 2026

ఎమ్మెల్యే పై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

. కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యం గారికి గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో అతనికి తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చిందని, అందులో నిందితుడు కాల్ లో మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనియెడల తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని మరియు తన ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు బాధితుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు పై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని, అక్కడినుండి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలిందని సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular