కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య (54), తండ్రి బక్కయ్య, పవర్ లూమ్ నందు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరీంనగర్ తీగలగుట్టపల్లి లోని సర్వేనెంబర్ 233/E నందు గల ప్లాట్ నెంబర్ 16, తూర్పు ముఖముగా 50 ఫీట్ల వెడల్పు రోడ్డు కలిగిన 293.33 చదరపు గజాల స్థలాన్ని 2003 సంవత్సరంలో మూల గౌరా రెడ్డి వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వున్నాడు. ఇదిలా ఉండగా మూల గౌరా రెడ్డి మరణానంతరం అతని కొడుకైన A1.మూల తిరుమలరెడ్డిగతంలో తమకు విక్రయించిన తమ ప్లాట్లకు గల 50 ఫీట్ల రోడ్డు వారికి చెందిందేనని, దానిని ఆక్రమించి రెండు ప్లాట్లుగా విభజించి తిరుమల రెడ్డి తల్లి అయిన A4) మూల వీరమ్మ (మూల గౌరా రెడ్డి భార్య) పేరిట తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దానిని A3) మూల సూర్య ప్రకాష్ రెడ్డి, తండ్రి మూల తిరుమల రెడ్డి A2)లంక శేఖర్ లకు విక్రయించినట్లుగా తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించడమే గాక వాటి ఆధారంగా గోడను సైతం సృష్టించారని విచారణ జరిపి న్యాయం చేయాలనీ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు, బాధితుడు ఫిర్యాదులో తెలిపిన విషయాలు నిజమేనని తేలినందున నలుగురిపై ఐపీసీ 420, 467, 468, 471 120-బి r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అందులో A1,A2 గా ఉన్న మూల తిరుమలరెడ్డి (53), తండ్రి మూల గౌరా రెడ్డి, లంక శేఖర్(52) తండ్రి పోచయ్య లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా కేసును పరిశీలించిన గౌరవ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా ని కరీంనగర్ ఏ ప్రదీప్ కుమార్ నిందితులిద్దరినీ కరీంనగర్ జైలుకు తరలించారు.
నకిలీ ధృవపత్రాలు సృష్టించి భూమిని తిరిగి ఆక్రమించినందుకు నలుగురిపై కేసు నమోదు
RELATED ARTICLES