Tuesday, October 13, 2026

ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ సీవీ ఆనంద్ ముఖాముఖి!

హైదరాబాద్, కలం నిఘా: న్యూస్ ప్రతినిధి: తెలంగాణ పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డిఎస్పీలతో ముఖా ముఖి సమావేశమై వారి కెరీర్ విజయ వంతం కావడానికి హైదరాబాద్ డిజిపి సీవీ ఆనంద్, సోమవారం పలు కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అధికారుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో కూడిన ఈ బ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన మొదటి డీఎస్పీ బ్యాచ్ ఇదేనని తెలిపారు.

సుమారు 44 వారాల పాటు అకాడమీలో వీరికి చట్టాలు, దర్యాప్తు విధానాలు, వృత్తి నైపుణ్యాలు, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్, డ్రిల్, పరేడ్ మరియు క్రీడల్లో అత్యుత్తమ శిక్షణ అందించారని వివరించారు. మరో 46 వారాల పాటు జిల్లా స్థాయిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందని, తెలిపారు.

దానిని కూడా అంతే శ్రద్ధతో పూర్తి చేయా లని సూచించారు. శిక్షణ పూర్తి చేసు కున్న అధికారులతో పాటు శిక్షణ ఇచ్చిన అకాడమీ ఫ్యాకల్టీ, సిబ్బంది, ఉస్తాద్‌ లను డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular