హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది, ప్రభుత్వ ఉద్యోగుల కు డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.రెండు పెండింగ్ డీఏలకు సంబంధించిన బకాయిలను చెల్లించడంతో పాటు సాధారణ డీఏను పెంచుతూ ఉత్తర్వు లు జారీ చేసింది.
సాధారణ డీఏను జనవరి 2024 నుంచి 33.67 శాతం నుంచి 37.31 శాతా నికి పెంచారు.అలాగే జూలై 2024 నుంచి ఈ డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నా రు. ఇక 2020 పే స్కేల్లోని ఉద్యోగు లకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు.
2015 పే స్కేల్లోని ఉద్యోగులకు డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచగా, జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెంచారు.
అలాగే యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్ ఉద్యోగులకు సైతం డీఏను పెంచుతు న్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెంచిన పెంచిన డీఏను అక్టోబర్ 2026 వేతనంతో కలిపి ఉద్యోగులకు నవంబర్ 1న అందజేస్తారు. ఇక డీఏ బకాయి లను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిం చింది.
జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను మొత్తం 33 వాయిదా ల్లో చెల్లించనున్నట్టు తెలిపారు. జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్టు తెలిపింది.


