నేడు పత్తి ప్రపంచ దినోత్సవం!
హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి: ప్రతిసారి దిగుబడి కోసం దిగులు పడే పత్తి రైతు దళారుల చేతుల్లో ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడు. ఈసారి కూడా ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడకపోవడం అధిక ఉష్ణోగ్రతలు తెగుళ్లతో పంట దెబ్బతినడం తో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి, పంట ఎదుగుదల సరిగా లేకపోవడంతో పత్తి రైతులు ఎరువులు, పురుగుల మందుల ఖర్చులతో పాటు..కూలీలపై భారీగా ఖర్చు చేశాడు . ఒకపక్క కరువు కాటేస్తుంది మరోపక్క తెగుళ్లు పత్తి రైతులను పట్టి పీడిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసినా రైతన్న కు ప్రతి ఏడాది నిరాశ ఎదురవుతుంది..
అలాంటి రైతన్న పండించిన పత్తికి అక్టోబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటున్నాం . ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో, ముఖ్యంగా కోట్ల మంది రైతులు, చేనే త కార్మికులు , వస్త్ర రంగానికి చెందిన కార్మికుల జీవితాల్లో పత్తి పాత్ర అత్యంత కీలకమైనది. 2019వ సంవత్సరంలో ప్రపంచవాణిజ్య సంస్థ అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థలతో కలసి జెనీవాలో మొదటి సారిగా ఈ దినోత్సవా న్ని ప్రారంభించాయి.
భారతదేశంలో పత్తిని తెల్ల బంగారం’ అని పిలుస్తారు. మన దేశ జీడీపీ , ఎగుమతుల్లో పత్తి, జౌళి రంగానికి గణనీయమైన వాటా ఉండగా, పత్తిని అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోం ది. తెలంగాణలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పత్తి విరివిగా సాగవుతోంది. ఇక్కడ పండించే పత్తి పింజ పొడవు ఎక్కువగా ఉండటంతో పాటు మంచి మెరుపు, బలం కలిగి ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ పత్తికి విశేషమైన డిమాండ్ ఉంది.
కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా నాణ్యమైన దుస్తులు, దారాల తయారీకి కూడా ఈ పత్తిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం వల్ల అంతే సవాళ్లతో కూడుకు న్నదిగా మారింది.
ఈ సమస్యలను అధిగమించేందుకు నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడవుతోంది. ఎకరానికి మొక్కల సాంద్రతను పెంచి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించే హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ పద్ధతులను అధికా రులు ప్రోత్సహిస్తు న్నారు.


