తిరుపతి, నిఘా న్యూస్ ప్రతినిధి: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ఓ ప్రైవేటు పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలినట్లు సమాచారం. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలు స్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మొదట ఇద్దరు మృతి చెంది నట్లు సమాచారం అందగా.. ఆ తర్వాత మృతుల సంఖ్య నలుగురికి చేరినట్లు తెలుస్తోంది. పలువు రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.
అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు.. సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభిం చారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికు లను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా రు. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారా?అనే అనుమానంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.


