Tuesday, October 13, 2026

అవినీతి నిరోధక అధికారులకు చిక్కిన సీడీపీఓ

జగిత్యాల, నిఘా న్యూస్: అంగన్ వాడి టీచర్ల నుంచి లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్ పల్లి, సీడీపీఓ దారోజు పద్మను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ డిఎస్పి గొర్రె మధు,తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా మెట్ పల్లి అర్బన్ సెక్టర్ పరిధిలో 21 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి, కేంద్రాల తనిఖీ సందర్భంగా వ్యతిరేకంగా రిపోర్టు లేకుండా చూసుకు నేందుకు సిడిపిఓ దారోజు పద్మ, టీచర్ల నుండి లంచం డిమాండ్ చేశారు.

పట్టణ పరిధిలోని అంగన్‌వాడీల్లో తనిఖీ రిపోర్ట్ నెగటివ్ గా ఇవ్వకుండా నెలకు రూ. 1000 ఇచ్చేలా మెట్ పల్లి అర్బన్ మండలం లోని 21 అంగన్‌వాడీ కేంద్రాలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 3 నెలల మొత్తం రూ. 63 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండె డ్ గా పట్టుకున్నారు.

తన అధికారిక హోదాను దుర్విని యోగం చేస్తూ అక్ర మంగా లబ్ధి పొందేం దుకు యత్నించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితురా లిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం లో హాజరు పరిచా రు. ఇక ఒక ప్రభుత్వ అధికారిణి ఇలా నెలవారీ పద్ధతిలో లంచం వసూలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాం శంగా మారింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular