హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి,అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత దివంగత ఆర్యధాన్ మహమ్మద్ స్మారకం-2026కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు.
శుక్రవారం కేరళం లోని నిలంబూరులో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ఈ అవార్డును నిర్వాహకులు ప్రదా నం చేయనున్నారు. రేవంత్ రెడ్డి, పాలనలో రైతులు, బీసీలు, సామాన్య పౌరుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకుగాను ఆయనను ఈ పుర స్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహ కుల జ్యూరీ వెల్లడిం చింది.
ప్రజాస్వామిక విలువ లపై సీఎం రేవంత్ రెడ్డి, నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రశంసించింది. ఆర్య దాన్ మహమ్మద్ నాలుగో వర్థంతి సందర్భంగా ఈరోజు శుక్రవారం ఈ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, అందుకోనున్నారు.


