హైదరాబాద్, నిఘా న్యూస్: ఖైరతాబాద్ గణపతిని టస్కర్ పైకి చేరి శోభయాత్ర కు బయలుదేరాడు అధికారులు మధ్యాహ్నం రెండు గంటల లోపు గణేశుని నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. ఎటువంటి డీజే సౌండ్ వాడకుండా కేవలం సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు
ఇక ఈ భారీ గణేషుడిని ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 5 వద్ద నిమజ్జనం చేసేం దుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.ఖైరతాబాద్ గణేశుడంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రతి ఏడాదీ ఇక్కడ గణేశుని నవరాత్రుల వేడుకలు కన్నుల పండువగా సాగుతాయి.
గణేశుడు ఈ ఏడాది పంచముఖ సంకట హర మహా గణపతి గా దర్శనమిచ్చాడు. ఈ రోజుతో దర్శనాలు పూర్తి అయ్యాయి. గడిచిన పదిరోజుల పాటు దాదాపు 20 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
మొదటి రోజు నుంచి నేటి దాకా గణేశుడికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు, హారతులు, అభిషేకాలతో పాటు గా ఆయన సన్నిధిలో మహాహోమం, శివ పార్వతుల కళ్యాణం, మహిళలతో ప్రత్యేక హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ముంబయి బ్యాండ్‌తో ఎంతో ఘనంగా వేడుకలు జరిగాయి.


