వరంగల్ ,నిఘా న్యూస్ ప్రతినిధి :వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర బైక్ ఢీకొని ఓ ఎసై మృతి చెందడం పోలీస్ శాఖను విషా దంలో ముంచేసింది,
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న,గణేష్ నిమజ్జనం డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 2 వద్ద విధు లకు హాజరయ్యారు. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు గుర్తు తెలియని బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి..
దీనితో పోలీస్ ఉన్నతాధికారులు సూచనల మేరకు కొత్తగూడెం లోని ఆయన నివాసానికి వెళ్ళాడు శరీరంలో విపరీతమైన నొప్పి ఉండడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఏంజిఎమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎసై వెంకన్న మృతి సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


