పెద్దపల్లి, కలం నిఘా న్యూస్, సెప్టెంబర్ 22: వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేష్ శోభయాత్రను సజావుగా జరిగేలా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళ వారం ఏసీపీ గజ్జి కృష్ణ పర్యటించారు.
మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలవద్ద ప్రత్యేక పూజలు చేసి రేపటి నిమజ్జనంపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మండ పాల నిర్వాహకులు ఎసిపి గజ్జి కృష్ణను శాలువాలతో సన్మానించారు
ఈ సందర్భంగా పెద్దపెల్లి ఏసిపి గజ్జి కృష్ణ మాట్లాడుతూ నిమజ్జన ఊరేగింపు ల సమయంలో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా శోభాయాత్రల ను ప్రశాంతంగా, సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
మండపాల నిర్వాహ కులు పోలీసుల సూచనలు పాటిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రమా దాలు జరగకుండా చెరువులు, కాలువల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, వెలుతురు మరియు లైఫ్గార్డుల ను అందుబాటులో ఉంచాలి అన్నారు.
నిమజ్జన వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు వాడరాదని సూచించారు.స్థానిక ప్రజలకు మరియు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలి.
ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై గట్ల సుధాకర్, పోత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచులు బంగారి రమేష్ జిన్నా రామచంద్రం రెడ్డి, ఆయా మండపాల నిర్వాహకులు తదితరులు ఉన్నారు.


