సెప్టెంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని ఆదేశాలు!
హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించిం ది, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబర్ నెలాఖరు లోగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది.
ఇందులో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 12,882 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. నియామక ప్రక్రియను జిల్లా స్థాయిలో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత, ఎంపిక విధానంపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నా రు. దీంతో ఇంటర్మీడి యట్ పూర్తి చేసి అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశంగా మారనున్నాయి.
రాష్ట్రంలోని 2 జోన్ల పరిధిలో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్-1లో 1,853 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,737 హెల్పర్ పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇక జోన్-2 లో 1,247 టీచర్ పోస్టులు, 5,145 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు జోన్లను కలిపితే మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ఇంటర్ మార్కులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం ఎంపికలో ఇంటర్మీడియట్ మా ర్కులకు 70 శాతం వెయిటేజీ కేటాయిం చారు. ఇంటర్వ్యూకు మరో 10 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థుల విద్యార్హత తో పాటు ఇంటర్వ్యూ పనితీరు కూడా ఎంపికలో కీల కంగా మారనుంది.
ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు కూడా ప్రభుత్వం వెయిటేజీ కల్పించింది. అనాథ లకు 10 శాతం, వితంతువులకు 5 శాతం, దివ్యాంగు లకు 5 శాతం వెయి టేజీ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దే శించిన నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి లోనే అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు.


