Monday, August 24, 2026

పెద్దపల్లి జిల్లాలో నేడు మంత్రుల పర్యటన!

పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాప నకు ఐదుగురు మం త్రులు బుధవారం పర్యటించనున్నారు. సుల్తానాబాద్‌, మంథని,వద్ద బహి రంగ సభ నిర్వహణ ఏర్పాట్లను అధికారు లు పూర్తి చేశారు.

రెండు నియోజక వర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. మంథని నియోజక వర్గంలో రూ.164.64 కోట్లు, పెద్దపల్లి నియోజక వర్గంలో రూ.222.68 కోట్లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నా రు.

ఈ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పాల్గొంటుండడంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనా లని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular