పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు మంగళ వారం మెరుపు దాడు లుచేసిరెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటు న్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టు కున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేం దర్ రెడ్డి,తో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందు గా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంత రం విచారణ కోసం మున్సిపల్ కార్యాల యానికి తీసుకెళ్లారు. అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నా రు.
ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ కార్యాల యంలో కలకలం రేగింది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.


