Monday, August 24, 2026

రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయండి : సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యం గా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుల కు సూచించారు.నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధిం చి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారిం చాల‌ని ముఖ్యమంత్రి కోరారు.

ఈ నెల 20 నుంచి వర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమవుతున్న నేప‌థ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై ఈరోజు ప్రజాభవన్‌ లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటే ష‌న్‌ను ఇచ్చారు. ఈ సమావేశంలో పలు వురు మంత్రులతో పాటు ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. దేశ జ‌నాభాలో 10 శాతం జ‌నాభా ఆరు మ‌హా నగ‌రాల్లో హైదరాబాద్ ఉంద‌ని, ఈ న‌గరాలు 25 శాతం జీడీపీ క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమ‌తి అవ‌స‌ర‌మ ని, ఎంపీలు ఈ విష‌ యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞ‌ప్తి చేయాల‌ని సూచించారు.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ ణ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల స‌ర‌ళిని ఎంపీ ల‌కు వివ‌రించారు.ఈ విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని బీజేపీ ఎంపీలు ఈట‌ల రాజేంద‌ర్‌ , కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular