కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రెండేళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో కొత్త సుడా చైర్మన్ ఎవరు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్‌కే మరోసారి అవకాశం దక్కుతుందా? లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, కార్పొరేటర్ మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


