హైదరాబాద్, నిఘా న్యూస్ :హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గ్యాంగ్ స్టర్లకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి, కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎస్‌యూవీలో కొందరు సాయుధులైన వ్యక్తు లు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో,దీంతో, పోలీసులు సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతం లో గాలింపు చర్యలు ప్రారంభించారు.ఈ క్రమంలో వ్యాపారి ఇంటిముందు గ్యాం గ్‌స్టర్లు అత్యాధునిక తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో దీపక్ నందల్ ముఠాకు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు మరణించ గా ఒక క్రిమినల్ గాయ పడ్డాడు. ముగ్గురు పోలీసులకు కూడా తూటా గాయాలయ్యా యి. కొద్ది రోజులుగా ఆ వ్యాపారికి విదేశీ గ్యాంగ్‌ల నుంచి బెదిరింపులువస్తున్న ట్టు కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఉదం తంలో కాల్పులకు తెగబడ్డ వారి వివరాలు, వారి నేర చరిత్ర గురించి త్వరలో వెల్లడిస్తామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు.
హరియాణాలో భారీ ఎన్ కౌంటర్
RELATED ARTICLES


