Monday, July 6, 2026

కొండగట్టు ఆలయంలో జేష్ఠాభిషేక వేడుకలు

జగిత్యాల, నిఘా న్యూస్ : జగిత్యాల జిల్లా మాల్యాల మండలం లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్క రించుకుని సోమ వారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాలయంలోని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చార ణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకంప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం పంచా మృత అభిషేకం నిర్వహించారు.

స్వామివారిని 108 కలశాలలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తెలంగాణ నలుమూలల నుం చి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పా ల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆధ్వ ర్యంలో అధికారు లు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular