అమరావతి, నిఘా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనపరమైన కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది, పాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులను తక్షణమే బదిలీలు కొత్త పోస్టింగులు కల్పిస్తూ..సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది, మార్కాపూర్ జిల్లా ఓఎస్డీ అడ్మినిస్ట్రేషన్ నవ్ జ్యోతి మిశ్రాను నియమించారు. తూర్పుగోదావరి రాజమండ్రి అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్ మనీష్‌ను బదిలీ చేశారు. అలాగే మండా జావలి అల్ఫోన్స్‌ను పోల వరం జిల్లా ఓఎస్డీగా నియమించారు.
అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాధ్ హెగ్డేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు ఇచ్చింది. రోహిత్ కుమార్ చౌదరికి పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. నంద్యాల అసిస్టెంట్ సూపరిం టెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఏఎస్పీ,సుస్మితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. పరిపాలనా అవస రాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టి నట్లు అధికార వర్గా లు వెల్లడించాయి.


