భూపాలపల్లి, నిఘా న్యూస్: కన్నెపల్లి పంపు హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీసుల ఆంక్షలు, అడుగడు గునా ఎదురైన అడ్డంకులను అధిగ మించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరు కున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటల కు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవా ల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 3 గంట ల సమయం పట్టిం దని మండిపడ్డారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణకు నీళ్లివ్వాలని కేసీఆర్ మహాయజ్ఞంలా కాళేశ్వరాన్ని నిర్మించారని, తాము ఇక్కడికి ఎవరినో నిందించడానికి లేదా? రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరం బాసర నుండి గోదావరి పారుతు న్నా సమైక్య రాష్ట్రం లో తెలంగాణ ఎడారిలానే ఉండిపో యిందని, నీళ్ల కోస మే ఆనాడు ఉద్య మం చేశామని కేటీ ఆర్ గుర్తుచేశారు.
పల్లం నుంచి నీటిని పైకి తేవచ్చని, మనం కూర్చున్న చోట 90 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నా యని కాళేశ్వరం నిరూపించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తుమ్మిడిహట్టి దగ్గర కడతామని ప్రజల ను మభ్యపెట్టారని, ఆనాడు మహారాష్ట్ర కు 152 మీటర్ల ఎత్తు పెంచవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ జల దౌత్యం జరిపి, మూడున్నరే ళ్లలో చర్యలు తీసు కుని, గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండే లా కన్నెపల్లి దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు.
ఈ భారీ ప్రాజెక్టులో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగితే కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచా రం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజ మెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తానని చెప్పినా ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు.
చేతకాకపోతే కేసీఆర్‌కు అప్పగించండి..
రాజకీయం చేయడానికి ఇక్కడి కి రాలేదు కెసిఆర్, పట్టుదలతో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాలే శ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుం దని, వర్షాలు కురవకపోయినా కన్నెపల్లి వద్ద నీరు ఎప్పుడు నిలువ ఉంటుందని అన్నారు. మీకు చేతకాకపోతే కేసీఆర్ కు కాలేశ్వ రం ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తారన్నారు.


