హైదరాబాద్, నిఘా న్యూస్: కల్వకుంట్ల కవిత, స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చాలం టూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది,
అయితే, ఇదే పేరు తో గతంలో ఉన్న పార్టీల చరిత్ర, ప్రజల నుంచి వస్తున్న అ భ్యంతరాలు, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరును అనుమ తించలేమ ని సీఈసీ లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న గుర్తింపు పొం దిన పార్టీల పేర్లతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కవిత తదుపరి 15 రోజులలోపు తమ పార్టీకి మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించా ల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదిం చని పక్షంలో, కవిత దాఖలు చేసిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖా స్తును మూసివేస్తా మని ఈసీ స్పష్టం చేసింది.
దీనితో కవిత, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తదు పరి కార్యాచరణపై దృష్టి సారించారు. కొత్త పేర్ల ఎంపికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉ న్నట్టు తెలుస్తుంది.


