హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, నిఘా న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో గురుకుల విద్యాసంస్థల్లో అవి నీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగు తున్నాయిఈ నేప థ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది.
కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ క్రికెటర్ మ హ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు.మరో వైపు బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని ఆధారాలతో వస్తా మని ప్రకటించడం తో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగ కుండా గన్‌పార్క్, ప్రెస్‌క్లబ్, తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు,మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఇతర అంశాలపై అన్ని ఆధారాలతో గన్‌పార్క్‌కు వస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు అక్కడే ఉండాలి’ అని సవాల్ విసిరారు. ప్రజల ముందే వాస్త వాలను వెల్లడిస్తా మని ఆయన స్పష్టం చేశారు.
అయితే తెలంగాణ భవన్ నుంచి గన్‌పా ర్క్కు బయల్దేరిన హరీశ్‌రావును పోలీ సులు అడ్డుకోవడం తో ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితిని అదుపు లోకి తీసుకురావ డానికి పోలీసులు అదనపు బలగాల ను మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారుకాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అప్పుల అం శంపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రకటించ డం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
గన్‌పార్క్‌లో అమర వీరుల స్తూపం వద్ద చర్చ నిర్వహించాల ని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతుండగా.కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయి లో ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీ యాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలు, సవాళ్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం గన్‌పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ పరిసరాల్లో భారీ పోలీసు బందో బస్తు కొనసాగుతోం ది.


