పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రోజురోజు కు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం అత్యవసరమని, స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఇటు పోలీసులు గానీ, మంథని మునిసిపల్ అధికారులు గాని ఏ మాత్రం పట్టించుకోవ డం లేదు మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ఘటన దీనికి ఉదాహరణ….బుధవారం సాయం త్రం రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుపోయిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది, రెండు వాహనాల మధ్యలో బైక్ ఇరుక్కుపోయి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని, జరగకపోవ డంతో అందరూ ఊపి రి పీల్చుకున్నారు.
మంథని పట్టణంలోని ప్రధాన దారులు అంబేద్కర్ చౌక్,గాంధీ చౌక్ రోడ్లు ఎప్పుడు రద్దీగా ఉంటాయి.రోడ్ల వెంబడి తరచూ ప్రజలు అవసరాలు రీత్య ప్రయాణాలు సాగిస్తుంటారు.కానీ ఈ దారుల వైపు వెళ్దామంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని జంకుతో వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.రోడ్ల ప్రక్కన ఉన్న వివిధ వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులు వారికి కేటాయించిన పరిధిని దాటుతూ.. రోడ్లను సైతం ఆక్రమి స్తూ రోడ్లపైనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంథని బస్టాండు ముందు ఉన్న టిఫిన్ సెంటర్ల్ కిరాణా షాపులు వల్ల ప్రధాన రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి, దుకాణాల ముందు వాహనాలు నిలపడంతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపటికి వెళ్లడానికి డ్రైవర్లు చాలా ఇబ్బం ది పడుతున్నారు.రోడ్లపై విచ్చలవిడిగా నిలుపుతున్న వాహనాలతో పాటు.. సంచరిస్తున్న పశువు లను మున్సిపాలిటీ అధికారులు నియం త్రించక పోతున్నారు. మున్సిపాలిటీ సిబ్బం ది సైతం జారీ చేసిన నిబంధనలను వ్యాపా రస్తులు పాటించకపో వడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా పోలీసు లు, మున్సిపాలిటీ అధికారులు స్పందించి రోడ్లపై ఇష్టానుసారంగా నిలుపుతున్న వాహనాలపై, రోడ్లపై తిరుగుతున్న పశువు లుపైన తగు చర్యలు తీసుకోవాలని, స్థాని కులు కోరుతున్నారు.


