హైదరాబాద్, నిఘా న్యూస్: తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్, చరిత్ర సృష్టించబోతున్నారా? తన తొలి ఎన్నికల్లోనే రెండు కీలక నియోజక వర్గాల్లో పోటీ చేసిన ఆయన వారి మెజారి టీతో గెలవబోతున్నా రా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది,ఈరోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే తమిళనాడు లో కనీవినీ ఎరగని రీతిలో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలుస్తుంది..
ఎన్నికల బరిలో దిగిన తొలిసారే.. గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు టీవీకే 108 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగు తోంది. ఈ క్రమంలో తమిళనా డు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సాధించి.. అధికారంలోకి వస్తుం దని భావిస్తున్నారు. తమిళనాడులో మొ న్నటి వరకు అధికారం లో ఉన్న డీఎంకే పార్టీ మూడో స్థానంలో కొన సాగుతుండటం గమ నార్హం.పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే విజయ్ టీవీ కే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త రికార్డ్ అంటున్నారు.
అయితే విజయ్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం ఎన్నికల వేళ ఆ పార్టీ ఇచ్చిన హామీలే అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏడు హామీలు విజయ్ ని విజయతీరాలకు చేర్చనున్నాయి.
TVK పార్టీ గెలుపు కారణాలు,హామీలు
1) ఎన్నికలలో టీవీకే పార్టీ వచ్చిన ముఖ్యమైన హామీ మదిప్పుమిగు మగళిర్ తిట్టం’ పథకం
దీని ద్వారా.. రాష్ట్రం లో 60 ఏళ్లలోపు మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 2,500 అందించి.. మహిళల కు ఆర్థిక సాధికారత కల్పిస్తామని ఎన్నికల వేళ టీవీకే హామీ ఇచ్చింది. TVK ఇచ్చిన వాటిల్లో ఇదే అతిపెద్ద వాగ్దానం.
2)అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం
దీని ద్వారా రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుం బానికి సంవత్సరానికి 6 ఎల్‌పీజీ సిలిండర్లను ఉచితంగా అందిస్తామ ని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకూ పెరుగు తున్న నేపథ్యంలో ఇంటి ఖర్చులను తగ్గిం చే దిశగా ఇది అతి కీలకమైన హామీగా నిలవబోతుంది.
3.)అన్నన్ సీర్ తిట్టం
ఈ పథకం ద్వారా.. రాష్ట్రంలో ఆడబిడ్డల వివాహం సందర్భంగా 8 గ్రాముల బంగారం విరాళంగా ఇస్తానని టీవీకే వాగ్దానం చేసింది. దీంతో పాటు పట్టు చీరలను విరా ళంగా ఇచ్చే పథకం కూడా ఓటర్ల దృష్టిని ఆకర్షించింది.
4.)కామరజార్ కల్వి ఉరుధి తిట్టం’
టీవీకే పార్టీ అతి ముఖ్యమైన హామీల్లో ‘కామరజార్ కల్వి ఉరుధి తిట్టం’ ఒకటి. రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందిస్తామంటూ టీవీకే ఈ పథకాన్ని ప్రకటించింది.
దీని ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువు తున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం పేదరికం వల్ల ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు.
5.)వెట్రి పయనం తిట్టం,ఈ పథకం ద్వారా..రాష్ట్రంలోని మహిళల ప్రయాణాన్ని సులభతరం చేయడా నికి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
6.)రూ. 4 వేలు నిరు ద్యోగ భృతి
యువతను,ఆకర్షించేందుకు, నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రకటించిం ది. దీని ద్వారా పట్ట భద్రులైన నిరుద్యోగు లకు నెలకు రూ. 4, 000, డిప్లొమా హోల్డర్ల కు నెలకు రూ. 2,500 ఇవ్వనున్నట్లు టీవీకే తెలిపింది.
7)రుణమాఫీ
TVK ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. దీని ద్వారా.. 5 ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అలానే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి 50 శాతం వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.
టీవీకే ప్రకటించిన ఈ హామీలు ఓటర్లను ఆకర్షించి ఆ పార్టీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే వీటి అమలు టీవీకే ముందున్న అతి పెద్ద సవాలు


